News & Views

చర్చ:పెద్దపల్లి: రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ జిల్లా కమిటీ ఎన్నిక..

  • జిల్లా అధ్యక్షునిగా సట్టు కనకయ్య,ప్రధాన కార్యదర్శిగా ఎండి.సమీఉల్లాకన్

రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా కమిటీ ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా రెండవసారి సట్టు కనకయ్య,ప్రధాన కార్యదర్శిగా ఎండి.షమీఉల్లాకన్, ఉపాధ్యక్షులుగా అనాసి.జ్యోతి, ఆర్థిక కార్యదర్శి రమణారెడ్డి, గౌరవ అధ్యక్షులుగా మల్యాల శంకరయ్య, గౌరవ సలహాదారు కే.సత్యనారాయణ, రాష్ట్ర ప్రతినిధిగా జి.రవి,ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ఎండి.అబ్దుల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ టెట్ పండితులకు వారి భాషలలోనే నిర్వహించాలి,పెన్షనర్స్ కు బకాయిలు వెంటనే చెల్లించాలని, పెండింగ్ డీఏ లను వెంటనే ప్రకటించాలని, ప్రాథమిక పాఠశాలలో తెలుగు పండిత్ పోస్టులను మంజూరు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి ఎన్.బిక్షపతి,రాష్ట్ర ప్రతినిధి జహంగీర్,పలు భాష పండితులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.