News & Views

చర్చ: పెద్దపల్లి: రోడ్ల పై తిరిగే కేజీ వీల్స్ ట్రాక్టర్ల వాడకం నిషేదం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

  • కేజీ వీల్స్ వాహనం వినియోగిస్తే మొదటిసారి 5 వేలు, 2వ సారి 10 వేల రూపాయల జరిమానా

రోడ్ల పై తిరిగే ట్రాక్టర్లు కేజీ వీల్స్ వాడకం నిషేదించామని, ఎవరు కూడా కేజీ వీల్స్ తో ట్రాక్టర్ల ను రోడ్లపై నడపరాదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

కేజీ వీల్స్ ట్రాక్టర్లతో రోడ్డు పై నడపడం వల్ల రోడ్లు శాశ్వతంగా పాడవుతున్నాయని, గుంతలు అధికంగా ఏర్పడటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. రోడ్ల పై కేజీ వీల్స్ వాడకాన్ని పూర్తి స్థాయిలో నిషేధించామని కలెక్టర్ తెలిపారు.

రోడ్ల పై కేజీ వీల్స్ ట్రాక్టర్ తో ప్రయాణిస్తూ దొరికితే మొదటిసారి 5000 రూపాయలు, రెండవసారి 10000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని, మూడవసారి దొరికితే సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి వాహనం సీజ్ చేయడం జరుగుతుందని, దీని పై రెవెన్యూ, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ రోడ్ల పైకి వచ్చిన కేజీ వీల్స్ ను వెంటనే జరిమానా విధిస్తూ, సంబంధిత చట్టం కింద కేసులు నమోదు చేయాలని, కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.