చర్చ, కరీంనగర్ : ఊటూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు “మోడీ కానుక” సైకిల్ల పంపిణీ

మానకొండూర్ మండలంలోని ఊటూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ సహకారంతో “మోడీ కానుకగా” సైకిల్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు సైకిల్లు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బండి సంజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మధుసూదనాచారి, బిజెపి మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి, రంగు భాస్కరాచారి, లక్ష్మీపూర్ ఉప సర్పంచ్ రాపాక ప్రవీణ్, ఊటూర్ సర్పంచ్ వెలిశెట్టి కళ్యాణి-కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, బిజెపి నాయకులు, వార్డు మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.