News & Views

చర్చ, కరీంనగర్: జవహర్ నగర్ పోస్టాఫీసు కరీంనగర్ హెడ్ పోస్టాఫీసులో విలీనం – పోస్టల్ ఎస్పీ కె.శివాజీ

కరీంనగర్ జ్యోతినగర్ ప్రాంతంలో ఉన్న జవహర్ నగర్ పోస్టాఫీసును కరీంనగర్ హెడ్ పోస్టాఫీసులో విలీనం చేయడం జరిగిందని, జనవరి 1వ తేది నుంచి జవహర్ నగర్ పోస్టాఫీసులో ఏలాంటి తపాలా సేవలు అందుబాటులో ఉండవని కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు. జవహర్ నగర్ బ్రాంచి పోస్టాఫీసులో ఇప్పటివరకు సేవలు పొందిన కస్టమర్లు జనవరి 1నుంచి
తమ తపాలా సేవలను సమీపంలోని ముకరంపుర
పోస్టాఫీసు లేదా కరీంనగర్ హెడ్ పోస్టాఫీసులో పొందాలని సూచించారు. శాఖాపరమైన పాలసీ విధానంలో భాగంగా ఈ బ్రాంచి విలీనం జరిగిందని, ఈ విలీనానికి ప్రజలు, ఖాతాదారులు సహకరించాలని పోస్టల్ ఎస్పీ శివాజీ ప్రకటనలో కోరారు.