News & Views

చర్చ, కరీంనగర్ : పంటల సాగుకు సరిపడా యూరియా నిలువలు

  • జిల్లాలో ఎరువుల కొరత లేదు
  • రైతులు ఆందోళన చెందవద్దు
  • ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంటల సాగుకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. యూరియా విషయమై రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఎరువులను రైతుల పంటల సాగు విస్తీర్ణానికి అనుగుణంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎరువులు పక్కదారి పట్టకుండా, ఇతర అవసరాలకు వాడకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా అందుబాటులో ఉందని సూచించారు.

జిల్లాలో యాసంగి సాగు కోసం మొత్తం 21 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటి దాకా 10 వేల 991 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని వెల్లడించారు. మిగతా కావాల్సిన ఎరువులు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రైవేట్ డీలర్లు 223, పీసీసీఎస్ షాపులు 54, డీసీఎంఎస్ 16, ఏఆర్ ఎస్ కే 13 ఎరువుల షాపులు ఉన్నాయని, అన్ని షాపులలో రోజూ ఉదయం ఆరు గంటల నుంచి విక్రయాలు మొదలు పెట్టాలని, ఎరువుల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.