News & Views

చర్చ, పెద్దపల్లి: 8 పాఠశాలలకు స్వచ్ఛ పాఠశాల అవార్డు ప్రధానం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

జిల్లాలోని ఎనిమిది పాఠశాలలకు స్వచ్ఛ పాఠశాలల అవార్డు ప్రధానం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.

సోమవారం కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో తన చాంబర్ లో స్వచ్ఛత అంశంలో ఉత్తమ పనితీరు కనబరిచిన 8 పాఠశాలలకు జిల్లాస్థాయి అవార్డులను, ప్రశంస పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం కింద 6 ముఖే అంశాలలో స్వీయ మదింపు (సెల్ఫ్ రేటింగ్) నిర్వహించుకున్నాయని కలెక్టర్ తెలిపారు. అనంతరం సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాలలను బయటి వారి నుంచి తనిఖీ చేయించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 8 పాఠశాలలకు జిల్లా స్థాయి స్వచ్ఛ పాఠశాల అవార్డులు ప్రధానం చేయడం జరిగిందని అన్నారు.

త్రాగునీటి వసతి, మరుగుదొడ్లు మూత్రశాలల నిర్వహణ, విద్యార్థులకు చేతులు పడుకోవడానికి సౌకర్యాలు, పాఠశాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పై విద్యార్థుల ప్రవర్తన అవగాహన, మిషన్ లైఫ్ కార్యక్రమాలు ( ఏకో క్లబ్ గ్రీన్ క్లబ్బు మొక్కల పెంపకం ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన) ఇటువంటి అంశాలను పరిశీలించి స్వచ్ఛ పాఠశాలలను ఎంపిక చేసామని అన్నారు.

స్వచ్ఛ పాఠశాల ఎంపిక కార్యక్రమం ద్వారా పాఠశాలలో హైజిన్ ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణపై అవగాహన మరింత మెరుగుపడిందని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీ.ఈ.వో శారద, AMO Dr.పి.యం. షేక్,CMO కవిత,సంబంధిత ప్రధానోపాధ్యులు,తదితరులు పాల్గొన్నారు.