News & Views

చర్చ, కమాన్‌పూర్‌: మండల కేంద్రంలోని ఆలయాల్లో ముక్కోటి ఏకాదశికి శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం

మండల కేంద్రమైన కమాన్ పూర్ లోని శ్రీ వేణుగోపాల స్వామి, సుప్రసిద్ధ క్షేత్రమైన స్వయంభు శ్రీఆదివరాహస్వామి ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ విశిష్ట పర్వదినం సందర్భంగా డిసెంబర్ 30 మంగళవారం తెల్లవారుజామున శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఉదయం 6 గంటల, 30 నిమిషాలకు, శ్రీ ఆది వరాహస్వామి ఆలయంలో ఉదయం 7 గం, 30 నిమిషాలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనo ప్రారంభమవుతుందని, ఆలయ నిర్వాహకులు తెలిపారు.
పాలకడలిలో అవతరించిన శ్రీమన్నారాయణ స్వరూపమైన శ్రీహరి ఉత్తర ద్వార దర్శనం చేయడం వల్ల గ్రహదోషాలు, గృహదోషాలు తొలగి పోతాయని, స్వామివారి కృపా కటాక్షాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర దర్శనంతో ఆధ్యాత్మిక ఆనందం, మనశ్శాంతి లభిస్తాయని ఆలయ కమిటీ తెలియజేసింది.
ఈ ప్రత్యేక దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆలయ కార్యనిర్వాహణాధికారి, అర్చకులు, సిబ్బంది కోరుతూ, భక్తుల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.