News & Views

చర్చ, నందతండా: నోటీసులు జారీ చేసిన ఆగని ఆక్రమణ -సెక్రటరీ విధులకు రాని రోజున గోడల నిర్మాణం చేస్తున్న ఆక్రమణదారుడు

చుంచుపల్లి మండలం, నందాతండా పంచాయతీ పరిధిలోగల పల్లె దవాఖాన వెనుక వీధిలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి గోడల నిర్మాణం చేపడుతున్నారని గ్రామస్తుడు నవంబర్ నెలలో మండల ఎంపీఓ, పంచాయతీ సెక్రటరీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆక్రమణదారుడికి నవంబర్ 27వ తేదీన పంచాయతీ సెక్రెటరీ నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు జారీ చేసి నెల రోజులు గడుస్తున్న కబ్జాదారుల వద్ద నుండి సెక్రటరీ ఎటువంటి వివరణ తీసుకోకపోవడం వలన మరల తిరిగి గోడల నిర్మాణం చేపట్టారు. నెల రోజులు గడిచిన ఎటువంటి వివరణ తీసుకోకపోవడం వలన అధికారిపై పలు అనుమానాలు చోటుచేసుకున్నాయి, అధికారి విధులకు రాని రోజునే గోడల నిర్మాణం చేయడం అనేది అధికారి అండతోనే జరుగుతూ ఉండవచ్చని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఇట్టి విషయమై సర్పంచ్ కు ఫిర్యాదు చేయగా, ఎటువంటి భూఆక్రమణకు అవకాశం ఇవ్వనని, ఫీల్డ్ విజిట్ చేసి, విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటానని, వినని పక్షంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయిస్తానని పేర్కొన్నారు.