News & Views

చర్చ: రామగిరి: పేరుక కులస్తులు అన్ని రంగలో రాణించాలి

  • రామగుండం బిజెపి ఇన్చార్జ్ కందుల సంధ్యారాణి

పేరుక కులస్తులు సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుండి రాణించాలని రామగుండం బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి అన్నారు. సోమవారం రామగిరి మండలం పేరుక సంఘం అధ్యక్షుడు ఉగ్గే కుమార్, ఆధ్వర్యంలో స్థానిక సెంటినరీ కాలనీలోని హిల్ పోర్ట్ పాఠశాలలో ముత్తారం, రామగిరి మండలాలలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ల లను శాలువాలతో సత్కరించి,పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పేరుక సంఘం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అంతకుముందు సెంటనరీ కాలనీ రాణి రుద్రమ స్టేడియం ముందు అమరవీరుల స్తూపం, మరియు తెలంగాణ ఉద్యమ కారుడు బుద్దె సత్యనారాయణ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మాజీ ఎంపీపీ అత్తే చంద్రమౌళి, కందుల పోశం, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు డి రవీందర్, బుద్దె ఉదయ్, లక్కర్తి మల్లయ్య, సందెల కుమార్, చింతల కిరణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.