News & Views

చర్చ,గోదావరిఖని: ప్రయాణికుల భద్రత – మన అందరి బాధ్యత ..

  • ట్రాఫిక్ నిబందలపై ఆటో డ్రైవర్లకు ఆవగాహన సదస్సు లో సిఐ ఇంద్రసేనా రెడ్డి..

రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఆటో డ్రైవర్స్‌కు గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి ఆద్వర్యంలో అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలు, వాహన ధ్రువపత్రాలు, లైసెన్స్, ఇన్సూరెన్స్ ల ప్రాముఖ్యత వివరించారు.
ఈ మేరకు సీఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతకు ఆటో డ్రైవర్స్ సహకారం ఎంతో కీలకమని అన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ బాధ్యతాయుతంగా వాహనం నడిపితే అనేక ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. ఏదైనా సమాచారం ఉంటే పోలీస్ వారికీ అందించాలని, కొంతమంది ఆటో డ్రైవర్స్ ప్రవర్తన, చేసే పనుల వలన అందరికి చెడ్డ పేరు వస్తుందని అలాంటి వారి సమాచారం పోలీసులకు తెలపాలన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆటో ల ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ పేపర్స్ కలిగి ఉండాలన్నారు, ప్రతి డ్రైవర్ కి తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ వర్తించాలంటే తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలన్నారు.ఆటో డ్రైవర్లందరు సరైన దృవ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు.