News & Views

చర్చ: రామగిరి : పన్నూర్ సర్పంచ్‌ చిందం మహేష్ ను సన్మానించిన ఎ-కౌసర్ మస్జిద్ కమిటీ సభ్యులు

రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌ చిందం మహేష్ , ఎ-కౌసర్ మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున
మైనార్టీ సోదరులు సర్పంచ్ చిందం మహేష్ ను ఆహ్వానించి మెడలో పూల దండ వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు తినిపించి అభినందించారు.

సర్పంచ్ చిందం మహేష్ మాట్లాడుతూ, మస్జిద్ కమిటీ సోదరుల ఆదరభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, గ్రామ అభివృద్ధికి అందరి సహకారంతో పనిచేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్ జి త్రీ వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి, రామారావు కెన్ చారి,మస్జిద్ కమిటీ సభ్యులు మత గురువు లు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.