చర్చ, జగిత్యాల: టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
- టెట్ పరీక్ష నిర్వహణ పై సమీక్షలో అడిషనల్ కలెక్టర్ లత
జనవరి 4న జే. ఎన్. టి. యు. హెచ్ కొండగట్టు కాలేజీలో నిర్వహించే టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష కొరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. టెట్ నిర్వహణ పై సంబంధిత అధికారులతో బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) మాట్లాడుతూ
జగిత్యాల జిల్లాలోని జే. ఎన్. టి. యు. హెచ్ కొండగట్టు కాలేజీ కేంద్రంలో 160 మంది అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్దతిలో ఉదయం 9 నుండి 11:30 వరకు మరియు మధ్యాహ్నం 2 నుండి 4:30 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్త్ తో పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్ లు కేంద్రం మూసివేయాలని తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద ఏ.ఎన్.ఎమ్ లతో ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పరీక్ష నిర్వహణకు అభ్యర్థులకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, కంప్యూటర్లు, జనరేటర్, అవసరమైన మౌళిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఈవో, ఆర్టీసీ డి.ఎం, జిల్లా వైద్యాధికారి, జే. ఎన్. టి. యు. హెచ్ చీఫ్ సూపరింటెండెంట్, ఎలక్ట్రిసిటీ ఎస్. ఈ, కలెక్టరేట్ ఏ.వో, సంబంధిత అధికారులు, తదితరులున్నారు.