News & Views

చర్చ, జగిత్యాల : చట్నీలో బల్లి.. జడుసుకున్న జనం

  • టిఫిన్ తిన్న 8 మందికి ఆస్వస్తత
  • ఇందులో ఇద్దరు చిన్నారులు

ఆకలి కేకలను చల్లార్పెందుకు ఓ హోటల్ కు వెళ్లిన వినియోగదారులు కేకలు పెట్టె దుస్థితి ఎదురైంది. ప్రశాంతంగా టిఫిన్ తినేందుకు కూర్చున్న కస్టమర్లకు తెచ్చిపెట్టిన టిఫిన్ తోటి చట్నీలో బల్లి ప్రత్యేక్షమై వినియోగదారులను ఆందోళన లకు గురించేసింది. అప్పటికే టిఫిన్ చేసిన 8 మంది అస్వస్థత గురికావడం తో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి కి వైద్యానికి తరలించారు. కాగా ఇందులో ఇద్దరు చిన్నారులు ఉండడం గమనార్హం. ఇదంతా జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా లో గల శివసాయి టిఫిన్ సెంటర్ లో ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఇదిలా ఉంటే ఇదే హోటల్ లో ఇలాంటి సంఘటన లు జరుగడం ఇది మూడవ సారని స్థానికులు అంటున్నారు. ప్రజారోగ్యం పై పట్టించుకోవాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారుల విధి నిర్వహణ ఎలా ఉందో ఇట్టే ఈ వరుస సంఘటన తోనే తెలిసిపోతోంది. జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.