News & Views

చర్చ, జగిత్యాల : కొండగట్టు గిరి ప్రదక్షిణ దారికోసం కరసేవకుడిగా మారుతా

కొండగట్టు అంజన్న తన ఇంటి దైవమని అతని దయతోనే తనకు పునర్జన్మ లభించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కొండగట్టు లో అభివృద్ధి పనులకు భూమిపూజ చేసేందుకు పవన్ కళ్యాణ్ వచ్చారు. కొండగట్టు కు వస్తున్న పవన్ కళ్యాణ్ కు జే ఎన్. టి. యు వద్ద జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం అంజన్న ను దర్శించుకొన్న డిప్యూటీ సి. ఎం పవన్ కళ్యాణ్ టి. టి. డి సహకారంతో నిర్మించనున్న 96 వసతి గదులు, మాల విరమణ మండపాల నిర్మానానికి పవన్ కళ్యాణ్ భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొండగట్టు అంజన్న తన ఇంటి దైవమన్నారు. గతంలో ఇక్కడికి వచ్చిన సమయంలో ఆలయ అధికారులు సమస్యలు తన దృష్టికి తెచ్చారని అప్పుడే మాట ఇచ్చానన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ అమలుకు సిద్ధం కావడం హర్షనియమన్నారు. కొండగట్టు ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ కోసం మార్గం సుగమం చేసేందుకు తానే ఓక కర సేవకుడుగా మారుతానాన్ని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంజన్న దయతో సుభిక్షంగా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరారు.