చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం,నందిపాడు గ్రామానికి చెందిన కుటుంబం తన కుమార్తెకు ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు…

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు..
పొట్ట కుట్టి కోసం వలస వెళ్లిన ఆ కుటుంబానికి చేదు అనుభవం ఎదురయింది. ఉన్న ఊరిలో ఉపాధి అవకాశాలు దొరక ఇల్లు కట్టడమే కష్టంగా మారిన ఆ కుటుంబం పని వెతుకుని వేరే ప్రాంతానికి వెళ్తే అక్కడ అనుకోని సంఘటన జరిగి ఇప్పుడు నాన్న ఇబ్బందులు పడుతున్నారు. పూట గడవడమే కష్టంగా మారిన ఆ కుటుంబం పై తమ కుమార్తె ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు లేక సతమతమవుతున్నారు దాతలు ఎవరైనా ముందుకొచ్చి సాయం చేస్తారేమో అనుకొని ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ,మండలం,నందిపాడు గ్రామం ఉపాధి పనుల కోసం డేరంగుల తన కుటుంబంతో కలిసి చీపురుగూడెంకు వ్యవసాయ పనుల నిమిత్తం శుక్రవారం సాయంత్రం వెళ్లారు. తమ ఐదేళ్ల పాప జాను పొరపాటున వేడివేడి నీళ్లలో పడటంతో శరీరంపై బాగా గాయాలయ్యాయి. వెంటనే పాపను కొత్తగూడెంలో చేర్పించగా అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు పంపించారు. ఇల్లు గడవక నానా యాతన పడుతున్న ఆ కుటుంబంపై మోయరాన్ని భారం పడింది. తమ పాప చికిత్స కోసం దాతలు దయాత్ర హృదయం ఆపదలో ఆదుకునే పెద్ద మనసు కలిగిన వారు ఎవరైనా తమకు సాయం చేయకపోతారా అంటూ నిరీక్షిస్తున్నారు. దాతలు ఎవరైనా ఉంటే గొంది మంగరాజు – 9398227663 నంబర్‌కు ఆర్థిక సాయం పంపించాలని వేడుకుంటున్నారు.