News & Views

చర్చ : కన్నూర్ , కేరళ రాష్ట్రం మహిళా మేడలో గొలుసు లాకెళ్లిన సిపిఎం కౌన్సిలర్…

కేరళలోని కన్నూరులో ఇటీవలే ఓ వృద్ధ మహిళ ఇంట్లోకి చొరబడి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయిన సిపిఐ ఎం మున్సిపల్ కౌన్సిలర్...

 

చర్చ : కన్నూర్ , కేరళ రాష్ట్రం మహిళా మేడలో గొలుసు లాకెళ్లిన సిపిఎం కౌన్సిలర్…

కేరళలోని కన్నూరులో ఇటీవలే ఓ వృద్ధ మహిళ జానకి (77) ఇంట్లోకి చొరబడి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయిన సిపిఐ(ఎం) మున్సిపల్ కౌన్సిలర్ ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు నిందితుడిని కూతుపరంబ మున్సిపాలిటీ నాలుగో వార్డ్ కౌన్సిలర్ పి.పి.రాజేష్ గా గుర్తించారు ఈ ఘటనతో పార్టీ అతడి ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగించింది. జానకి (77) అనే ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడి హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి మహిళా వంటగదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వచ్చి బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుండి పరారయ్యాడు బాధితురాలి అరుపులు విని సహాయం చేయడానికి వచ్చిన చుట్టుపక్కల వారు చూస్తుండగా దొంగ తప్పించుకున్నాడు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని సిపిఎం పార్టీ కౌన్సిలర్ రాజేష్ గా గుర్తించి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.