చర్చ, పెద్దపల్లి: పెద్దంపేట సర్పంచ్ శ్రీనివాస్ ను సన్మానించిన- టీచర్ లింగమల్ల జ్యోతి -శంకరయ్య
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామం గ్రామ సర్పంచిగా నూతనంగా ఎన్నికైన ఆముల శ్రీనివాసు ను ఆల్ ఎంప్లాయిస్ వెల్ పర్ సొసైటీ వ్యవస్థాపకులు టీచర్ లింగమల్ల జ్యోతి- శంకరయ్య సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజికవేత్త, ప్రజా సేవకుడు మా తోటి సహోదరుడు సర్పంచిగా ఎన్నిక కావడం మాకు ఆనందకరమని తెలిపారు సర్పంచ్ శ్రీనివాస్ ను శాలువ కప్పి, పూలమాలతో ఘనంగా సన్మానించి రాజ్యాంగ నిర్మిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర గ్రంథాన్ని బహుకరించారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు, కుటుంబ సభ్యులు, వేముల సురేష్, కుమార్ కందుగుల, కాళేశ్వరం జోన్ యాత్ ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.