News & Views

చర్చ, పెద్దపల్లి: ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

  •  వైద్య ఆరోగ్యశాఖ పని తీరు పై సమీక్షించిన జిల్లా కలెక్టర్
  • జిల్లాలోని రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
  • సోమవారం కలెక్టర్ సమీకృత జిల్లా సముదాయంలో వైద్యారోగ్య శాఖ పని తీరుపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య కొంత తగ్గిందని, ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఏ.ఎన్.ఏం రిజిస్ట్రేషన్ నుంచి టీకాలు వేయించడం, రెగ్యులర్ చెకప్, ప్రసవం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే లోపం ఉండాలని కలెక్టర్ తెలిపారు. ప్రసవం తర్వాత కూడా బాలింత, శిశువు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ రెగ్యులర్ ఫాలో అప్ చేయాలని అన్నారు.

ఆర్.బీ.ఎస్.కే బృందాలు రెగ్యులర్ గా ప్రభుత్వ స్కూల్స్ ను తనిఖీ చేస్తూ పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఆర్.బి.ఎస్.కే బృందాలు సందర్శించినట్లుగా పాఠశాలల కు సర్టిఫికెట్ జారీ చేయాలని, సదరు వివరాలు ఆన్ లైన్ లో నమోదు జరిగేలా విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఎన్.సి.డీ సర్వే 82% జరిగిందని ఆ వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. మార్చి నెలాఖరు వరకు 100% ఎన్.సి.డి సర్వే పూర్తి చేయాలని, ఎన్.సి.డి సర్వేలో మధుమేహం బిపి ఉన్నవారికి ప్రభుత్వం తరఫున అవసరమైన మెడికల్ కిట్ లు రెగ్యులర్ గా అందించాలని అన్నారు. ప్రతి వారం ఎం.ఎల్.హెచ్.పి లు 50 ఎన్.సి.డి సర్వే శాంపిల్స్ ర్యాండం గా క్రాస్ చెక్ చేయాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో పాజిటివ్ గా తేలిన టిబి కేసుల వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్, అవసరమైన చికిత్స, ప్రభుత్వ సహాయం అందేలా చూడాలని అన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ టీబీ వ్యాధి లక్షణాలు గల వారిని గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

రోగులకు డయాగ్నొస్టిక్ హబ్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి ఫలితాలు అందించడంలో పెద్దపెల్లి జిల్లా ముందు ఉందని అన్నారు. పీ.హెచ్.సి లో మరమ్మత్తు గురైన వైద్య పరికరాలను బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఆరోగ్యశ్రీ పరిధిలో స్పెషలిస్ట్ వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో అధికంగా జరిగేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల రోగులు మంచి అభిప్రాయంతో ఉండేలా మన పని తీరు ఉండాలని అన్నారు. వైద్యులు తప్పనిసరిగా సమయ పాలన పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను నిరాకరించడానికి వీలు లేదని అన్నారు.

రోగులతో ప్రవర్తించే తీరు పట్ల సిబ్బంది, నర్సులను ఎప్పటికప్పుడు ట్రైన్ చేయాలని అన్నారు.
జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో నిబంధనల మేరకు పారిశుధ్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు ఆరోగ్యశాఖ అధికారి వాణిశ్రీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు