చర్చ, రామగిరి: జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ విజేతలకు అభినందన మంథని జేఎన్టీయుహెచ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విష్ణువర్ధన్:
ఈనాడు దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన
ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్లో వరసగా రెండవసారి గెలిచిన మంథని జేఎన్టీయూ క్రికెట్ క్రీడాకారులను సోమవారం నాడు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. బులుసు విష్ణువర్ధన్ పేరు పేరునా అభినందించారు. ప్రిన్సిపాల్ చాంబర్లో జరిగిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విష్టువర్ధన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీలో విజేతలుగా నిలిచి క్రికెట్ కప్ సాధించడం ఆనందంగా ఉందని, ఇదే ఊపును భవిష్యత్తులో జరగబోయే రీజియన్ స్థాయి క్రికెట్ టోర్నీలో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయిలో మంథని జేఎన్టీయూ కళాశాల పేరును ఇనుమడింపచేయాలనీ క్రీడాకారులను కోరారు. కళాశాలలో చదివే క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చేందుకు కళాశాల యాజమాన్యం సిద్ధంగా ఉందన్నారు. ఈ అభినందన కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు గాడిపల్లి సునీల్, కృష్ణారెడ్డి, కుమార్, కళాశాల ఉద్యోగులు మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.