News & Views

చర్చ, రామగిరి: ప్రతి కార్యకర్త నిలదీసే తత్వం పెంచుకోవాలి

  • మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పిలుపు
    సెంటినరీ కాలనీలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం

ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్త ప్రజా సమస్యలపై నిలదీసే తత్వాన్ని అలవర్చుకొని ధైర్యంగా ముందుకు సాగాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పిలుపునిచ్చారు. సెంటినరీ కాలనీలోని సాయి రామ్ గార్డెన్‌లో మండల బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
రామగిరి మండలంలో బీఆర్‌ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని, కార్యకర్తలే పార్టీకి బలమని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ ప్రజా సమస్యలను విస్మరిస్తోందని ఆరోపించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించే తత్వం ప్రతి కార్యకర్తలో ఉండాలన్నారు.
ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓటమితో నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని సూచించారు. పార్టీ కార్యకర్తలకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని, పార్టీ బలోపేతం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. రానున్న రోజుల్లో అధికార పార్టీ రూ.5 వేల వరకు ఇచ్చి ఓట్ల కొనుగోలు ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఇటువంటి ప్రలోభాలకు కార్యకర్తలు, ప్రజలు లొంగకూడదని హితవు పలికారు.
బీఆర్‌ఎస్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, పార్టీ సిద్ధాంతాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో తిరిగి బీఆర్‌ఎస్ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో మండల, గ్రామస్థాయి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటివల సర్పంచ్, వార్డ్ సభ్యులుగా గెలుపొందిన అభ్యర్థులను సన్మానించారు. ఈ సమావేశం లో నాయకులు నాగెల్లి సాంబయ్య, శంకేసి రవీందర్, పూధారి సత్యనారాయణ, కుమార్ యాదవ్,దేవ శ్రీనివాస్, జవహర్ సర్పంచులు పల్లె పద్మ, మంతెన చంటి, సుంకరి మహేందర్, కొండ వేన దివ్య, పుట్ట రాజన్న, తదితరులు పాల్గొన్నారు.