News & Views

చర్చ : హైదరాబాద్, ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌…

ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌

హైదరాబాద్‌లో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా, బాగ్ అంబర్‌పేట్ ప్రాంతంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్, మరో ముగ్గురు పంచాయతీరాజ్ అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

సర్వే రిపోర్టు కోసం రూ.1.50 లక్షలు డిమాండ్ చేసిన కిరణ్ కుమార్, మొదటి విడతగా రూ.50 వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ చేపట్టారు.