చర్చ,కొత్తగూడెం: ముగ్గుల పోటీలకు అంత సిద్ధం

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో పొంగులేటి యూత్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించనున్న ఈ పోటీలకు ప్రకాశం స్టేడియం ను పొంగులేటి యూత్ సభ్యులు, అభిమానులు సర్వం సిద్ధం చేశారు. డివిజన్ లవారిగా మొత్తం 700 మంది మహిళలు పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీలో గెలుపొందిన మహిళలకు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందించనున్నట్లు వారు తెలిపారు. ప్రథమ బహుమతి రూ.30వేల నగదు, ద్వితీయ బహుమతి రూ.25వేల నగదు
తృతీయ బహుమతి రూ.20వేల నగదు, నాలుగవ బహుమతి రూ. 15 వేలు, ఐదవ బహుమతి రూ. 10 వేలు, కన్సోలేషన్ బహుమతులు ఐదుగురికి రూ.5వేలు , పాల్గొన్న ప్రతీ మహిళకు ప్రోత్సాహక బహుమతులను అందించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు.