చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మందకోడిగా మద్యం టెండర్ల ప్రక్రియ…
మందకోడిగా మద్యం టెండర్ల ప్రక్రియ - ఆశించిన స్థాయిలో రాని దరఖాస్తులు - దరఖాస్తు సొమ్ము పెంచడమే కారణమా!?

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మందకోడిగా మద్యం టెండర్ల ప్రక్రియ…this is a highlighted text
– ఆశించిన స్థాయిలో రాని దరఖాస్తులు
– దరఖాస్తు సొమ్ము పెంచడమే కారణమా!?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2025–2027 కాలానికి మద్యం షాపుల లైసెన్సుల కోసం టెండర్ల ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుకు గత నెల 26 నుండి శుక్రవారం వరకు గడువు విధించారు. ఇందుకుగాను దరఖాస్తు రుసుం రూ. 3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం దరఖాస్తుల తోనే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం వస్తుందని ఆశించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దరఖాస్తుల సంఖ్య భారీ స్థాయిలో పడిపోయినట్లుగా తెలుస్తోంది గత సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తే ఈ ఏడాది వందల సంఖ్యలోనే దరఖాస్తులు అందుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి లైసెన్సుల జారీలో గౌడ కులస్తులకు 15 శాతం, దళితులకు 10 శాతం గిరిజనులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించారు. కులం ఆధారంగా టెండర్లు దాఖలు చేసే అభ్యర్థులు వారి కుల దృవీకరణ పత్రాన్ని కూడా దరఖాస్తు తో పాటు జత చేయాల్సి ఉంటుంది అయితే పెరిగిన ఖర్చులు మద్యం వ్యాపారంలో ఆదాయం తగ్గిపోవడంతో టెండర్లు దాఖలు వేసేందుకు ఆశావాహులు ఆసక్తి చూపించడంలేదు. అంతేకాకుండా కొంతమంది వ్యాపారులు నూతన మద్యం పాలసీపై హైకోర్టులో సైతం పిల్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలునిచ్చాయి. ఈ బంద్ కు అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ బంద్ ప్రభావం కూడా మద్యం టెండర్ల దరఖాస్తుకు కొంత సంకటంగా మారింది. చివరి రోజైనా దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని ఆశించిన ఎక్సైజ్ అధికారులకు కొంత నిరాశ ఎదురైంది. ఇంత అర్ధరాత్రి అయినా మద్యం దరఖాస్తుల కోసం వచ్చే లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఎక్సైజ్ అధికారులకు మౌఖిక ఆదేశాల అందినట్లు సమాచారం.
పరిశీలనలో ఉన్న అభ్యర్థులు ఎక్సైజ్ చట్టం 1968 కింద శిక్ష పడిన కాకూడదనే నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు.. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఈనెల 23 వ తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్లో బహిరంగ లాటరీ ద్వారా ఆయా లబ్ధిదారులకు మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. నూతనంగా లాటరీ ద్వారా మద్యం దుకాణాలను దక్కించుకున్న లబ్ధిదారులు ఈ ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి వారి వారి మద్యం దుకాణాలు తెరుచుకోవాల్సి ఉంటుంది