చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆశ్రయ హ్యాండ్ ఆఫ్ హోప్ సహకారంతో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా……
ఆశ్రయ హ్యాండ్ ఆఫ్ హోప్ సహకారంతో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం .
పాల్వంచ మండలంలోని మారుమూల గ్రామమైన ఉలవనూరు గ్రామంలోని ఉల్వనూరు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆశ్రయ హ్యాండ్ ఆఫ్ హోప్,ఆధ్వర్యంలో జాయ్ ఫ్రెండ్స్ సహకారంతో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈయొక్క శిబిరంలో అనేక రకాల అనారోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించి రోగులకు మందులు పంపిణీ చేశారు. ఆశ్రయం క్యాంపు నిర్వాహకులు జైరాజు మాట్లాడుతూ…మానవ సేవే మాధవ సేవ అనే నినాదం తో తమ ట్రస్ట్ దెయమని తెలిపారు.ఏజెన్సీ ప్రాంతమైన ఉల్వనూర్ లో శిబిరం ఏర్పాటు చేసి పేద ప్రజలకు తమ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయం అందించడం తమ కు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు.అవసరం అయిన రోగులకు వెంటనే ఎక్స్ రే, ఈసీజీ పరీక్షలు నిర్వహించి వెంటనే పరీక్ష రిపోర్ట్లు ఇవ్వటం జరుగుతుంది.ముఖ్యంగా కళ్ళు, హృదయం, కాలేయం ఇతరత్రా సమస్యలకు ఆపరేషన్ లు కూడా ఉచితంగా చేయిస్తున్నట్లు నిర్వహుకులు, వైద్యులు తెలిపారు.ఆశ్రయ హ్యాండ్ ఆఫ్ హోప్ ద్వారా గత 20 ఏళ్లుగా అనేక రాష్ట్రాల్లో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మారుమూల గ్రామాలలోని ప్రతి పేదవారికి వైద్యం అందాలనే ధ్యేయం తో మొబైల్ వైద్య సేవలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యాక్రమం లో పాల్గొన్నవారు
జయరాజు – కో ఆర్డినేటర్
Dr. వెంకటేశ్వర్లు – MD, జనరల్ మెడిసిన్
Dr.చేతేన్య – డెంటల్ డాక్టర్
Dr. హీమబిందు – జనరల్ ఫిజిషియన్,
శ్రీధర్ – ఒప్టోమెట్రిస్ట్
ల్యాబ్, x రే, ఫార్మసీ అండ్ పర మెడికల్ స్టాఫ్
జాయ్ ఫ్రెండ్స్ టీమ్:
లారెన్స్,నరేష్,జేమ్స్,సుధీర్
,రవి,రాజు,డేవిడ్,నవీన్
లోకల్ ఆర్గనైజషన్.
మోసెస్,యేసు బాబు తదితరులు పాల్గొన్నారు