News & Views

చర్చ ,కరీంనగర్‌ :రేపు కరీంనగర్‌ జిల్లాకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

చర్చ ,కరీంనగర్‌ :
సీఎం రేవంత్ రెడ్డి రేపు చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలం ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణాలను పరిశీలించి, భద్రతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భారీ పోలీస్ బందోబస్తుతో పాటు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ స్థలాలను కేటాయించారు.