News & Views

చర్చ బెల్లంపల్లి : మేడారం జాతరతో బెల్లంపల్లి ఆర్టీసీకి రూ.70.37 లక్షల ఆదాయం

చర్చ బెల్లంపల్లి:

మేడారం జాతర సందర్భంగా బెల్లంపల్లి నుంచి నడిపిన ప్రత్యేక బస్సులతో ఆర్టీసీకి రూ.70,37,638/- ఆదాయం లభించినట్లు ఆసిఫాబాద్ డిపో మేనేజర్ కె.వి. రాజశేఖర్ తెలిపారు. గత నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన మేడారం జాతరకు బెల్లంపల్లి నుంచి మొత్తం 76 బస్సులను ఏర్పాటు చేసి, 250 ట్రిప్పులు నడిపినట్లు ఆయన వివరించారు. ఈ ప్రత్యేక బస్సుల ద్వారా మొత్తం 7,341 మంది భక్తులను మేడారం చేరవేసినట్లు తెలిపారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణా సదుపాయాలు కల్పించడంతో పాటు, ఆర్టీసీకి గణనీయమైన ఆదాయం కూడా సమకూరిందని డిపో మేనేజర్ కె.వి రాజశేఖర్ పేర్కొన్నారు