చర్చ, సత్తుపల్లి : పాముకు పాలు పోశాం విషం కక్కింది

పాముకు పాలు పోశాం విషం కక్కింది
కల్లూరు గడ్డపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్
20 మంది కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలి
కల్లూరు మున్సిపాలిటీ అభివృద్ధి బాధ్యత నా భుజాలపై మంత్రి స్పష్టం
“ఇది నా ఊరు… నా గడ్డ… నా బాధ్యత”
మొదటి విడతలోనే కల్లూరు అభివృద్ధికి ₹25 కోట్లు
పగటి కలలు కంటున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కమ్యూనిటీ హాల్స్
రైతులకు ఇబ్బంది లేకుండా లింక్ రోడ్ల అభివృద్ధి
చర్చ, సత్తుపల్లి:
కల్లూరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో, రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయి వ్యాఖ్యలతో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు.
ఈనెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 20 మంది కౌన్సిలర్ అభ్యర్థులను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలి అని ఆయన పిలుపునిచ్చారు.
జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ,
“పాముకు పాలు పోశాం అది విషం కక్కింది అని చిన్నపామైనా సరే పెద్దకర్రతో తల పగలగొడతాం”
అని వ్యాఖ్యానించడంతో సభ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ప్రజల విశ్వాసాన్ని ద్రోహించే రాజకీయాలకు ఇకపై తావు లేదని ఆయన స్పష్టం చేశారు.
నేను పుట్టి పెరిగిన ఊరు… ఇది నా గడ్డ అని మంత్రి పొంగులేటి భావోద్వేగంగా మాట్లాడుతూ,
నేను పుట్టి పెరిగిన ఊరు కల్లూరు ఇది నా గడ్డ ఈ ప్రాంతంలోని ప్రతి అంగుళం నాకు తెలుసనీ అన్నారు. కల్లూరులో ప్రతి సమస్య నాకు తెలిసినదే అని అన్నారు.
కల్లూరు అభివృద్ధి తనకు రాజకీయ బాధ్యత మాత్రమే కాకుండా వ్యక్తిగత కర్తవ్యమని, శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అభివృద్ధికి భారీ ప్రకటన ₹25 కోట్లు
కల్లూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం
మొదటి విడతలోనే రూ.25 కోట్ల నిధులను మంజూరు చేస్తాను అని మంత్రి ప్రకటించారు. ఈ నిధులతో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధిదీపాలు, మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేస్తామని తెలిపారు.
మీ ఇంటి పెద్ద కొడుకుగా నేనున్నాను అని ప్రజలను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు.
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
ప్రత్యర్థులపై రాజకీయ దాడి
ఎదురువర్గాలను ఉద్దేశించి మంత్రి తీవ్రస్థాయిలో స్పందిస్తూ, కొంతమంది పగటి కలలు కంటున్నారు కానీ ప్రజలే మీకు బుద్ధి చెబుతారు అని అన్నారు. మీరు ఈ పట్టణానికి ఇప్పటివరకు ఏం చేశారు ఒకసారి మీ మనసును మీరు ప్రశ్నించుకోండి అంటూ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. కల్లూరు మున్సిపాలిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కమ్యూనిటీ హాల్స్ మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు.
సామాజిక సమానత్వమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలు, వ్యవసాయ భూములకు వెళ్లే
లింక్ రోడ్లను అభివృద్ధి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అన్నారు.
కల్లూరు అభివృద్ధి నా వ్యక్తిగత బాధ్యత ఇది నా ఊరు నా గడ్డ నేను పుట్టి పెరిగిన గడ్డ. దీన్ని అభివృద్ధి చేయడం నా వ్యక్తిగత బాధ్యత అని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.
కల్లూరును అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్పి నుండి కల్లూరు అంబేద్కర్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాఘమై , తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయబాబు, రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, ఆర్యవైశ్య జిల్లా సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, 20 మంది వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.