చర్చ :- కరీంనగర్ : అక్రమ అరెస్టులు తగవు

చర్చ :- కరీంనగర్
అక్రమ అరెస్టులు తగవు
సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాlసుదేవ రెడ్డి
చొప్పదండి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎలాంటి పిలుపు లేకున్నా సిపిఎం నాయకులను అక్రమ అరెస్టు చేయడం తగదని సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి అన్నారు.
గురువారం రోజున పోలీసులు ఉదయం సిపిఎం నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం సరికాదన్నారు.
ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత బిఆర్ఎస్ పాలన లాగానే నియంతృత్వ పోకడలతో ముందుకు వెళుతుందన్నారు.
ప్రజా పాలన అంటే అక్రమ అరెస్టులు చేయడమేనా?అని ప్రశ్నించారు.
అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అనచలేరన్నారు.
ఇలాగే నియంతృత్వ పోకడలతో ముందుకెళ్తే టిఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుంది అన్నారు.