News & Views

చర్చ ఇల్లందు : 23 వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

కాలనీ వాసుల మద్దతుతో ఊపందుకున్న ప్రచారం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

 

చర్చ ఇల్లందు :  ఇల్లందు మున్సిపల్ 23 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండపల్లి సరిత గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డులో ఉన్న సమస్యలను శ్రద్ధగా విన్నారు. ప్రజలతో మమేకమై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందని, ప్రజల విశ్వాసమే తమకు అసలైన బలమని వారు స్పష్టం చేశారు. 23 వ వార్డు సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఈ సందర్భంగా తాగునీటి సమస్య, డ్రైనేజ్, రోడ్ల అభివృద్ధి, పారిశుధ్యం, పేదల సంక్షేమం వంటి మౌలిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ దశలవారీగా పరిష్కారాలు చూపుతామని నాయకులు పేర్కొన్నారు.
ఈ ఇంటింటి ప్రచారం లో కాలనీవాసులు తదితరులు చురుకుగా పాల్గొని ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
అలాగే స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు కాలనీ మహిళలు, యువత, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. ప్రజల నుంచి లభిస్తున్న స్పందన చూస్తే ఈసారి 23 వ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.