మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి: బెల్లంపల్లిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా

చర్చ బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి:
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి పట్టణంలో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న భద్రతా చర్యలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసు బందోబస్తు, సిబ్బంది కేటాయింపు వంటి అంశాలను సీపీ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఎన్నికల సమయంలో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సంపత్, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.