News & Views

చర్చ:-కరీంనగర్ : బీజేపీకి గెలిపించిన వెంటనే రూ.500 కోట్లు తెస్తా

చర్చ:-కరీంనగర్ :

బీజేపీకి గెలిపించిన వెంటనే రూ.500 కోట్లు తెస్తా

మా చొరవతోనే పంచాయతీలకు రూ.250 కోట్లు విడుదలైనయ్

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డే

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలకు వరదలా నిధులు తీసుకొస్తా

హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలీటీలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులిచ్చింది

మున్సిపల్ పీఠం అప్పగించిన వెంటనే హుజూరాబాద్ లో స్టేడియం నిర్మించే బాధ్యత నాది

సీఎస్సార్, ఎంపీ లాడ్స్ నిధులతో సౌకర్యాలు కల్పిస్తా

మినీ ట్యాంక్ పనులు పూర్తి చేయిస్తా

హుజూరాబాద్ రూపురేఖలు మారుస్తా

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు

హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థులతో ప్రతిజ్ఝ చేయించిన కేంద్ర మంత్రి

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి రూ.500 కోట్ల నిధులు తీసుకొస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలైనందున కేంద్రం తాజాగా రూ.259 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తాను చొరవ తీసుకోవడంవల్లే నిధులు విడుదలయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందని ఎద్దేవా చేశారు. తమకు మోసపు మాటలు చెప్పడం చేతకాదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మాదిరిగా దొంగ హామీలు ఇవ్వలేమని చెప్పారు. మాట ఇచ్చామంటే తప్పకుండా నెరవేర్చి తీరుతామని అన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే ఢిల్లీకి పోయి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి హుజూరాబాద్ పట్టణం రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. హుజూరాబాద్ లో మినీ స్టేడియం నిర్మాణం కోసం కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పించడంవల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. ఎన్నికలైన వెంటనే స్టేడియం నిర్మాణం పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటానని, ఎవరు అడ్డు వస్తారో చూస్తానని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు హుజూరాబాద్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ఎన్నికల ఇంఛార్జ్ ఎర్రం మహేశ్ సహా స్థానిక నేతలంతా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

హుజూరాబాద్ పట్టణానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చిన. కేంద్ర ప్రభుత్వం హుజూరాబాద్ అభివ్రుద్ధి కోసం ఎన్ని నిధులిచ్చిందో, ఏయే అభివ్రుద్ధి పనులు జరిగాయో పూర్తి వివరాలతో సహా బుక్ లెట్ ప్రింట్ చేయించిన. వాటిని ఇంటింటికీ పంపుతున్నా. 14, 15వ ఆర్ధిక సంఘం ద్వారా 19 కోట్ల 57 లక్షలు… స్వచ్ఛ భారత్ ద్వారా 1 కోటి 10 లక్షలు…. అమ్రుత్ 16 కోట్ల 25 లక్షలు… స్వనిధి ద్వారా 4వేల 377 మందికి 7 కోట్ల 63 లక్షలు…పట్టణ మౌలిక సదుపాయాల(యూఐడీఎఫ్) ద్వారా 36 కోట్లు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇచ్చింది. వీధి దీపాల మొదలు, రోడ్లు, డ్రైనేజీ, స్మశాన వాటిక నిర్మాణం దాకా అన్నీ కేంద్ర నిధులే…

ఇవిగాక సీఎస్సార్, ఎంపీ లాడ్స్ నిధులతో కోట్ల రూపాయలు తీసుకొచ్చి హుజూరాబాద్ లో ఆసుపత్రికి మెడికల్ ఎక్విప్ మెంట్స్ ఇచ్చిన. వాటిని మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. కానీ అక్కడ డాక్టర్లు, సిబ్బంది ఆశించిన స్థాయిలో లేరు. అట్లాగే కమ్యూనిటీ హాల్స్ నిర్మించిన. బోర్లు వేయించిన. ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు ఇచ్చిన. టెన్త్ పరీక్ష ఫీజు నా జీతం నుండే చెల్లించిన.

బీజేపీకి మున్సిపల్ చైర్మన్‌ పీఠం అప్పగించిన వెంటనే హుజూరాబాద్‌ పట్టణంలో అర్థాంతరంగా నిలిచిన మినీ ట్యాంక్‌ బండ్‌ పనుల పూర్తి చేయిస్తా. పట్టణంలోని నిరుపేదలకు ఇళ్ల మంజు చేయిస్తా. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పంపిణికి తక్షణ చర్యలు చేపడతాం. పట్టణంలో అవసరమైన చోట మురుగు కాలువలు, సీసీ రోడ్లు, విద్యుత్‌ దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. హుజూరాబాద్ సుందర పట్టణాలుగా తీర్చి దిద్దేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటా. హుజూరాబాద్‌లో కూడా మినీ స్టేడియం ఏర్పాటుకు కేంద్ర మంత్రిగా ప్రత్యేక చొరవ తీసుకొని నిధుల మంజూరికి కృషి చేస్తా. హుజూరాబాద్‌ నియోజకవర్గానికే పెద్దదిక్కుగా ఉన్న 100 పడకల ప్రభుత్వ దావఖానాలో కార్పోరేట్‌ స్థాయి వైద్య సేవలు అందేలా ప్రత్యేక చొరవ తీసుకుంటాం.

మాకు మోసాలు చేయడం రాదు. దొంగ హామీలివ్వడం చేతకాదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసపు మాటలు నమ్మి మీరు మోసపోయారు. అందుకే మహిళలకు రూ.2500లు, తులం బంగారం, స్కూటీ, అవ్వాతాతలకు రూ.4 వేలు, నిరుద్యోగ భ్రుతి ఇయ్యలే. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఏమిచ్చారు? గాడిద గుడ్డు తప్ప. అందుకే మంచి పాలన కోసం ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి ..మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.