చర్చ, కొత్తగూడెం కార్పొరేషన్ : ఓటర్లే నా ప్రచారకర్తలు – కూరపాటి సుధాకర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రామవరం 14 వ డివిజన్ సిపిఐ పార్టీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి కూరపాటి సుధాకర్ సుభాష్ చంద్రబోస్ నగర్ నందు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కూరపాటి సుధాకర్ మాట్లాడుతూ, బలహీన వర్గాలకు, మైనారిటీలకు అండగా నిలబడేది సిపిఐ పార్టీ అని, కార్పొరేటర్ గా గెలిచిన మొదటి రోజు నుండే డివిజన్ అభివృద్ధి పనులు ప్రారంభిస్తానని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చేస్తానని తెలిపారు. ఓటర్లు ప్రచారకర్తలుగా మారి ప్రచారాన్ని విజయవంతం చేయడం చాలా ఆనందంగా ఉందని, 14వ డివిజన్ విజయం సిపిఐ సొంతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు