News & Views

చర్చ, కామారెడ్డి : పిట్లం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ

 

చర్చ, కామారెడ్డి :
జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు పిట్లం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో మాట్లాడి, రోల్ కాల్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ వారు నిర్వహిస్తున్న విధులపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఆర్థిక నేరాలు, దొంగతనాలపై సమీక్ష నిర్వహించి, నేరాల నివారణకు విజిబుల్ పోలీసింగ్ మరియు గస్తీ పెంచాలని ఎస్‌ఐ గారికి ఆదేశాలు ఇచ్చారు.
అలాగే సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో జిల్లా ఎస్పీ గారి వెంట బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి గారు ఉన్నారు