చర్చ : వైరా , ఖమ్మం జిల్లా, ఆ ఇద్దరు పార్టీ వీడటం వల్ల… పార్టీకి నష్టం ఏమీ లేదు…
బిఆర్ఎస్ పార్టీ అంతా ఖాళీ అయిందనే అసత్య ప్రచారం ప్రజలు నమ్మొద్దు...

చర్చ : వైరా, ఖమ్మం జిల్లా, ఆ ఇద్దరు పార్టీ వీడటం వల్ల… బిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు...
బిఆర్ఎస్ పార్టీ అంతా ఖాళీ అయిందనే అసత్య ప్రచారం ప్రజలు నమ్మొద్దు…
స్థానిక మున్సిపాలిటీ కేంద్రమైన వైరాలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఆ ఇద్దరు నాయకులు పార్టీని వీడడం వల్ల పార్టీకి ఎటువంటి నష్టం ఏమీ లేదని.. బిఆర్ఎస్ పార్టీ అంతా ఖాళీ అవుతుందని కాంగ్రెస్ పార్టీ చేసిన అసత్య ప్రచారాన్ని నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు నమ్మొద్దని బిఆర్ఎస్ పార్టీ వైరా పట్టణ అధ్యక్షులు మద్దెల రవి విమర్శించారు.. వైరాలో సోమవారం జరిగిన పార్టీ నాయకులు కార్యకర్తలు సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నుండి 500కు పైగా నాయకులు కార్యకర్తలు చేరుతున్నారంటూ సాక్షాత్తు ఉపముఖ్యమంత్రినే పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని దీంతో బట్టి 500 మంది పార్టీలో చేరిక విషయంపై ప్రస్తారించారని ఆయన విమర్శించారు… బిఆర్ఎస్ పార్టీలో విమర్శించారు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి అనుభవించి.. అధికారం కోసం పదవుల కోసం పార్టీ వీడిన వైరా మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, అధికార దాహం పై ప్రజలకు అవగాహన ఉందని.. తుది తీర్పు ప్రజలే చెబుతారన్నారు.కాంగ్రెస్ పార్టీలో ఒకరికొకరు కాంగ్రెస్లో వర్గాలు తన్నుకునే రోజులు తొందరలో ఉన్నాయన్నారు.. త్వరలోనే వైరా ప్రజలు కల్లారా చూస్తారని ఆయన అన్నారు.. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కట్టా కృష్ణార్జున రావు మాదినేని దుర్గాప్రసాద్ తడికమళ్ల నాగేశ్వరరావు అప్పం సురేష్, బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి ఆదూరి ప్రేమ్ కుమార్ దొంతబోయిన గోపి వల్లెపు రాము బత్తుల లింగారావు, కారుకొండ బోసు, వాంకుడోతు వీరన్న విలాసాగరం నరేష్ కొత్తపల్లి సురేష్ చాట్ల దానియేలు దేవర పల్లి కాంతారావు బండారు వాసు మాచర్ల శంకర్ వేముల శివ నందిగామ మనోహర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.