చర్చ, కొత్తగూడెం కార్పొరేషన్ : 17వ డివిజన్ లో ఎర్రవెల్లి శంకర్ ఇంటింటి ప్రచారం

చర్చ, కొత్తగూడెం కార్పొరేషన్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 17 డివిజన్ తెలుగుదేశం పార్టీ, ప్రజా సంఘాలు బలపరిచిన సిపిఐ అభ్యర్థి ఎర్రవెల్లి శంకర్ ఇంటింటికి ప్రచారాన్ని కొనసాగించారు. ప్రచారంలో భాగంగా ఎర్రవెల్లి శంకర్ మాట్లాడుతూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, గడిచిన రెండు సంవత్సరాలలో ఎన్నికల నిర్వహణ జరగకపోవడం, కార్పొరేషన్ ని పట్టించుకునే ప్రజా ప్రతినిధి లేకపోవడం వలన అభివృద్ధి స్తంభించిపోయింది. పారిశుధ్యం వీధులలో కరువైంది. వీధి కుక్కలు, పందులు, చెత్త, కోతులతో వీధులన్నీ అపరిశుభ్రంగా మారాయి. శానిటైజేషన్ లేక దోమలు, ఈగలతో విష జ్వరాలు ప్రబలి చిన్నారులు, వృద్ధులు జ్వరాన పడిన రోజులు కూడా ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజీలు, మంచినీరు, పారిశుధ్యం వంటివి అభివృద్ధిలో ఒక భాగం మాత్రమే. నియోజకవర్గాల్లో సిపిఐ పార్టీ చాలా బలంగా ఉన్నది కావున అభివృద్ధికి ఎటువంటి ఆలస్యం ఉండదు. ప్రాథమిక విద్య, వైద్యం, త్రాగునీరు, కార్యాలయాలు, లైబ్రరీలు, ఉపాధి పథకాలు, యువతకి ఉపాధి శిక్షణలు, మెడికల్ క్యాంపులు, జనన, మరణ ధ్రువీకరణ వంటి పత్రాలు, మధ్యవర్తి లేకుండా లంచాలు ఇవ్వకుండా ప్రభుత్వంతో పని చేయించుకునే విధంగా 17వ డివిజన్ ని అభివృద్ధి చేస్తానని, సిపిఐ అభ్యర్థి అయిన నన్ను ప్రోత్సహిస్తూ మీ అమూల్యమైన ఓటుని కంకి కొడవలి గుర్తుపై వేసి కార్పొరేటర్ గా గెలిపించగలరని కోరారు.