News & Views

చర్చ,గోదావరిఖని : కంట తడి పెట్టిన మాజీ ఎమ్మెల్యే…

ఓట్లను నోట్లతో వృధా చేయకండి...

 

చర్చ,గోదావరిఖని:
ఎన్నికల ప్రచారంలో కన్నీటి పర్యంతమైన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్…

ఓటును నోటుకు అమ్ముకోవద్దని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కన్నీటి పర్యంతమయ్యారు. కార్పొరేషన్ ఎన్నికలలో బాగంగా 52 డివిజన్‌లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు కోరుకంటి చందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న మహేష్ ను గెలిపించాలని కోరారు. ఇదే సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ నేను రెండు కోట్లు అప్పుల పాలయ్యానని అన్నారు. గడిచిన ఎన్నికల్లో డబ్బులు పంచని కారణంగా ప్రజలు తనను ఓడించారని కన్నీటి పర్యంతమయ్యారు. డబ్బులు పంచిన కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు గెలిపించారని అన్నారు. ఇంకా కాంగ్రెస్ ఇచ్చిన హామీల ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రజలు డబ్బుల వ్యామోహంతో విలువైన ఓటును వృధా చేసుకోవద్దని బాధాతత్వ హృదయంతో ప్రజలను కోరారు.