News & Views

చర్చ,గోదావరిఖని : 47 వ డివిజన్ లో సిపిఐ ఇంటింటి ప్రచారం లో ఓటర్లనుండి అపూర్వ స్పందన.

కంకి కొడవలి గుర్తు పై ఓటు వేసి కార్పొరేటర్ గా గెలిపించండి. ఓటర్లను కోరిన సిపిఐ అభ్యర్థి కన్నెబోయిన కనకరాజు.

చర్చ,గోదావరిఖని:

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యం లో 47వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సిపిఐ నగర కార్యదర్శి కన్నెబోయిన కనకరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గురువారం పార్టీ నగర సమితి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ 47 వ డివిజన్ లో ప్రజా సమస్యలపై అధికారం లేకున్నా ఆందోళన కార్యక్రమాలు చేసి డ్రైనేజీ ల నిర్మాణం, రోడ్డు నిర్మాణం చేపట్టం జరిగిందని ఆయన అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేది ఒక్క సిపిఐ పార్టీయేనని, స్థానిక అభ్యర్థి గా ఎన్నికల్లో ప్రజా సేవ కోసం పోటీ చేస్తున్నానని, ఆశతో ఉన్న వాడికి అధికారం ఇస్తే దోచుకు తింటాడని ఆశయం తో ఉన్న నాకు ఓటర్లు అధికారం ఇస్తే డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. సిపిఐ పార్టీ అభ్యర్థిగా తనకు కంకి కొడవలి గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. 47 వ డివిజన్ లో ఇంటింటి తిరుగుతూ కంకి కొడవలి గుర్తుకు ఓటేయాలని ఆయన ఓటర్ల ను కోరారు. ఎన్నో పార్టీలకు అవకాశాలు ఇచ్చారు సిపిఐ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండని ఆయన కోరుతూ ప్రచారం నిర్వహించారు. కాగా ఓటర్ల నుంచి ఇంటింటి ప్రచారం లో అపూర్వ స్పందన లభించిందని ఆయన తెలిపారు. ఇంకా ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు తాళ్ళపెల్లి మల్లయ్య, మడికొండ ఓదెమ్మ, తొడుపునూరి రమేశ్ కుమార్, పడాల కనకరాజు, ఎర్రగొల్ల చేరాలు, నస్పూరి గట్టయ్య, గుంపుల కుమారస్వామి, చెప్యాల మహేందర్ రావు తదితరులు పాల్గొన్నారు