చర్చ, హుస్నాబాద్ : భూక్య సంపత్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న మంత్రి

చర్చ:- హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా:
హుస్నాబాద్ మున్సిపాలిటీ లోని 6 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య సంపత్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బంజారా మహిళల తో కలిసి నృత్యం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.
హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.
ఎన్నికల ప్రచారంలో భారీగా పాల్గొన్న కార్యకర్తలు , మహిళలు
ప్రజా పాలన ప్రభుత్వం లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ డోర్ టూ డోర్ ప్రచారం
అనంతరం ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగిన కార్నర్ మీటింగ్ లో
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం
ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఎల్లమ్మ ఆలయం ,పోచమ్మ ఆలయం అభివృద్ధి చేస్తున్నాం.
హుస్నాబాద్ అంటే గౌరవం పెరిగేలా చేశాం.
శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశాం.
250 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది.. పీజీ మెడికల్ కాలేజీ వస్తుంది.
హుస్నాబాద్ కి నలువైపుల నాలుగు లైన్ రోడ్డు వేస్తున్నాం.
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
రోడ్లు , డ్రైనేజీ నిర్మాణాలు, తాగునీటికి ప్రత్యేక సౌకర్యాలు కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేశాం.
మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి సెట్విన్ శిక్షణ ఇస్తున్నాం.
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తున్నాం. గతంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు.
ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం.. నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు ..పట్టణంలోనే 500 ఇల్లు ఇచ్చాం.
సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం.. గతంలో తినే పరిస్థితి లేని దొడ్డు బియ్యం వచ్చేది
ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు వడ్డీలేని రుణాలు, రైతు భరోసా, రైతు రుణమాఫీ,సన్న వడ్లకు బోనస్ లాంటి పథకాలు అమలు చేస్తున్నాం.
6 వ వార్డులో భుక్య సంపత్ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఎల్లమ్మ బజార్ పెద్దమ్మ ఆలయం నుండి ఆరవ వార్డులో ఉన్న ఎల్లమ్మ ఆలయం వరకు స్వయంగా ఆటో నడుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో నడుపుతూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.