చర్చ,గోదావరిఖని : మహిళలు భయం వీడండి.. ఒక్క ఫోన్ కాల్… ఒక మెసేజ్… చాలు
మహిళల కోసం షీ టీం ..- పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడి.

చర్చ,గోదావరిఖని:
ఒక్క ఫోన్ కాల్ చేయండి… ఒక మెసేజ్ పంపండి. భయం వీడండి… ధైర్యంగా ఫిర్యాదు చేయండి. మహిళలు, బాలికల భద్రతకు భరోసాగా, అండగా రామగుండం షీ టీమ్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో మహిళలు,బాలికల భద్రత కోసం షీటీమ్స్ నిరంతరంగా సేవలు అందిస్తున్నాయని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పోలీస్ శాఖపై,షీ టీమ్స్‌పై నమ్మకం, భరోసాతో మహిళలు, బాలికలు తమపై జరుగుతున్న వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జోన్‌లో ఒక షీ టీమ్, మంచిర్యాల జోన్ పరిధిలో రెండు షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. మహిళలు, బాలికలు, పిల్లలను ఎవరు అయినా వేధిస్తే వెంటనే సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. షీ టీమ్ వాట్సాప్ నంబర్: 6303923700
పెద్దపల్లి జోన్ షీ టీమ్: 8712659386
మంచిర్యాల జోన్ షీ టీమ్: 8712659385, అదేవిధంగా డయల్ 100కు కాల్ చేయవచ్చని సూచించారు. మహిళలు,బాలికలు సురక్షిత ప్రయాణం కోసం టీ సేఫ్ (ట్రావెల్ సేఫ్) యాప్‌ను వినియోగించుకోవాలని కోరారు.