చర్చ :-కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే. నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాం..

చర్చ :-కరీంనగర్
తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే. నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాం..
రైతులు విద్యార్థులు నిరుద్యోగ మహిళల సంక్షేమమే ప్రధాన లక్ష్యం..
కరీంనగర్లో రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తాం..
కరీంనగర్ వరంగల్ జంట నగరాల అభివృద్ధికి ప్రత్యేక కృషి..
డంపు యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం..
కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని
బాసర నుండి భద్రాచలం వరకు దేవాలయాలను అభివృద్ధి చేస్తాం..
టెంపుల్ టూరిజం పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతాం..
ధర్మపురి కొండగట్టు దేవాలయాలను అభివృద్ధి చేస్తాం..
అటవీ ప్రాంతాన్ని ఏ కో టూరిజం గాతీర్చిదిద్దుతాం..
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
బహిరంగ సభలో ప్రసంగం..
దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు మరియు మహిళల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ పాలనను సాగిస్తున్నామని స్పష్టం చేశారు.
గురువారం ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
గుమ్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3.25 గంటలకు చేరుకోగా రాష్ట్ర మంత్రులు. శనసభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్, శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, మక్కన్ సింగ్, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయ రమణారావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం బహిరంగ సభ వద్ద రూ.45.15 కోట్లతో కరీంనగర్ జిల్లా రామడుగు వెదిర గ్రామంలో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ. 5 కోట్లతో గంగాధర మండలం మధురానగర్ చేపట్టనున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యమైన పాయింట్స్..
కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అనేక ఏళ్ల నుంచి కరీంనగర్ నగరాన్ని పట్టిపీడిస్తున్న డంప్ యార్డు సమస్యను పరిష్కరిస్తామని. కరీంనగర్ వరంగల్ నగరాలకు మధ్య డంప్ యార్డు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా కరీంనగర్ రింగ్ రోడ్డు మంజూరు చేస్తామని తద్వారా కరీంనగర్ అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి జరుగుతుందని పేర్కొన్నారు. కరీంనగర్ తో పాటు వరంగల్ నగరాలను జంట నగరాలు అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
కరీంనగర్ గడ్డ నుంచే మలిదశ ఉద్యమం ప్రారంభమై తెలంగాణ రాష్ట్ర సాధనకు దోహదపడిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లక్షల సంఖ్యలో ఇళ్లను లబ్ధిదారులకు అందించిందని, ఉచిత విద్యుత్ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత కరెంట్ వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో రైతులు విద్యార్థులు నిరుద్యోగులు మహిళల సంక్షేమ లక్ష్యంగా నిరంతరం పాటుపడుతున్నామని పేర్కొన్నారు
వచ్చే విద్యాసంవత్సరం నుండి లా, ఎల్‌ఎల్‌ఎం, ఇంజినీరింగ్ కళాశాలలు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. కేవలం 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు బీమా పంపిణీ చేశామని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి 48 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని స్పష్టం చేశారు.
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, సమ్మక్క–సారలమ్మ జాతరలో సైతం మహిళలకు ఉచిత రవాణా కల్పించడం జరిగిందని తెలిపారు. ఉచిత రవాణా ద్వారా ప్రతి మహిళకు నెలకు దాదాపు రూ.4 వేల వరకు ఆదా అవుతుందని, ఇప్పటి వరకు దాదాపు రూ.9 వేల కోట్లను ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందన్నారు. మహిళా స్వయం ఉపాధి సంఘాలకు జీరో వడ్డీ రుణాలుగా రూ.27 వేల కోట్లు మంజూరు చేసి ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని. వారిని అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీలో మహిళలకు 1000 అద్దె బస్సులను కేటాయించామని వాటికి యజమానులు మహిళా లేనని స్పష్టం చేశారు. ఆదాని అంబానీలకు దీటుగా మహిళలకు సోలార్ పవర్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. వారికి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే బాధ్యతలు అప్పగించామని చెప్పారు. జగిత్యాలలో రోడ్డు విస్తరణ, యంగ్ ఇండియా స్కూల్ కొరకు స్థలాల్ని కేటాయిస్తామని, వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయించామని, ఆ అభివృద్ధి పనులు నడుస్తున్నాయని చెప్పారు. ధర్మపురి, కొండగట్టు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని, అటవీ ప్రాంతాలను ఎకో టూరిజంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని బాసర నుండి భద్రాచలం వరకు దేవాలయాలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఆయా ప్రాంతాలను టూరిజం డెవలప్మెంట్ కింద తీసుకుని అభివృద్ధి చేస్తామని. పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కరీంనగర్ డంప్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని, కరీంనగర్ వరంగల్ జిల్లాలను జంట నగరాలుగా తీర్చిదిద్దేలా రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి ఆ జిల్లాల మధ్యలో డంప్ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో చివరగా 2676 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.110 కోట్ల 10 లక్షల 12 వేల రూపాయల చెక్కులను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఓటి కెనాల్స్ ఏర్పాటు జరిగిందని, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూసేకరణకు మిగిలిన నిధులను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కోరారు. తద్వారా కొండగట్టు ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. నారాయణపూర్ రిజర్వాయర్ పనులను ప్రభుత్వం సత్వరమే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా చొప్పదండి నియోజకవర్గంలో సాగునీటి బాధ తీరుతుందని, చొప్పదండి సస్యశ్యామలంగా మారుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు. అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. చొప్పదండి నియోజకవర్గానికి ఏటిసి డిగ్రీ కాలేజ్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ధర్మపురి కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని పేర్కొన్నారు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమానికి యంగ్ ఇండియా మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, సాగునీరు, విద్య, వైద్య రంగాల్లో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. పేద ప్రజల సంక్షేమ లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత సన్నబియ్యం వంటి పథకాలు అమలవుతున్నాయని తెలిపారు . టిఎస్పీఎస్సీ ద్వారా దాదాపు 70 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు . ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని . కులగణన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేశారని, రైతులు, నేత కార్మికుల సంక్షేమానికి వేల కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. పెండింగ్ అభివృద్ధి పనులను ప్రాధాన్యతనుబట్టి పూర్తి చేస్తామని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధికి నిరంతరం పాటు పడతామని ప్రణాళిక ప్రకారం పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేస్తామన్నారు. కరీంనగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రికి ఎనలేని అభిమానమని పేర్కొన్నారు. రైతు బీమా రైతు భరోసా రైతు రుణమాఫీ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. రైతుల సంక్షేమ లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు