చర్చ, సత్తుపల్లి : సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి సూపర్డెంట్ మృతి

చర్చ, సత్తుపల్లి:
సత్తుపల్లి ఏరియాలో దాదాపు 25 ఏళ్లగా వైద్య సేవలు అందిస్తున్న కె వెంకటేశ్వర్లు
ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, ఉద్యోగులు సిబ్బంది సంతాపం తెలిపారు
సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో సూపర్డెంట్ గా విధులు నిర్వహిస్తున్న కె వెంకటేశ్వర్లు (61) మృతిచెందిన సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం. సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో సుమారు 25 ఏళ్లగా వివిధ హోదాల్లో వైద్య సేవలు అందిస్తూ ప్రస్తుతం ఆస్పత్రి సూపర్డెంట్ గా విధులు నిర్వహిస్తున్న కె వెంకటేశ్వర్లు (61) శుక్రవారం ఉదయం ఇంటి వద్ద తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే సత్తుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించగా ఆస్పత్రి డయాలసిస్ విభాగంలో వైద్యులు సిపిఆర్ సేవలు అందిస్తుండగా మృతి చెందాడు. వైద్యులు కె.వెంకటేశ్వర్లు 2016 నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ కొనసాగిస్తున్నారు. దీంతో సూపర్డెంట్ కె వెంకటేశ్వర్లు మృతి పట్ల ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు, ఉద్యోగులు సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు,……..