News & Views

చర్చ హైదరాబాద్ : ప్రతి పోలీసు విధులలో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి.

సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ, శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలి.

చర్చ హైదరాబాద్ :  జిల్లా పోలీస్ కార్యాలయం
మెదక్ జిల్లా

ప్రతి పోలీసు విధులలో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి.

సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ, శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలి.

చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది, చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమే

మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్

ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన పరేడ్ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ మహేంద్ర గారు హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంలో సిబ్బందికి క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం మరియు ఆరోగ్యం పరిరక్షణపై సూచనలు చేశారు.
ప్రతి పోలీసు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని, విధులలో నిర్లక్ష్యం చేయవద్దని, శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా, మానసిక ధైర్యం మరియు చట్టపరమైన అవగాహన కూడా అవసరం అని వెల్లడించారు.
చట్టం ప్రతి ఒక్కరికి సమానంగా అమలులో ఉండేలా చూడాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు. విధులను నిర్వర్తించే సమయంలో చెడు అలవాట్లను దూరంగా ఉంచుకోవాలని, సమర్థవంతంగా సేవలందించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెదక్ డియస్పి ప్రసన్న కుమార్, మెదక్ రూరల్ సీఐ జర్జ్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ కృష్ణ ముర్తి, ఆర్ఐలు శైలందర్,రామకృష్ణ, ఎసై లు సిబ్బంది పాల్గొన్నారు