News & Views

చర్చ : సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటాం.. మాజీ ఎమ్మెల్యే సండ్ర..

సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటాం.. మాజీ ఎమ్మెల్యే సండ్ర..

చర్చ , సత్తుపల్లి:

సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో తమపై ఉన్న విశ్వాసమే దీనికి నిదర్శనమన్నారు. ప్రత్యర్థి పార్టీల ర్యాలీలకు సరైన ఆదరణ లేదని, వారి ప్రసంగాల్లోనే ఓటమిని అంగీకరించారని విమర్శించారు.

గత రెండేళ్లలో పాలకుల మార్క్ అభివృద్ధి ఎక్కడా కనిపించలేదని, రైతు బంధు, పెన్షన్ పెంపు, తులం బంగారం వంటి హామీలు అమలు కాలేదన్నారు. షాదీఖానా, మినీ స్టేడియం, సామాజిక భవనాల నిర్మాణాలు నిలిచిపోయాయని, 100 పడకల ఆసుపత్రి పూర్తయినా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదని ఆరోపించారు. సింగరేణి బాధితులకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని ప్రశ్నించారు.

తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎప్పుడూ జూదం ఆడలేదని స్పష్టం చేశారు. గత 15 ఏళ్లుగా ప్రజలకు సేవ చేసినట్లే ఇకముందు కూడా ప్రజల మధ్యలోనే ఉంటానన్నారు. సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీ ఓటర్లు ఆలోచించి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తి చేశారు.