News & Views

చర్చ : కొత్తగూడెం మున్సిపాలిటీ , కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి కాంగ్రెస్ లీడర్ సెల్ వైస్ చైర్మన్ హైకోర్టు న్యాయవాది పైడిపల్లి చైతన్య పిలుపు ..

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి కాంగ్రెస్ లీడర్ సెల్ వైస్ చైర్మన్ హైకోర్టు న్యాయవాది పైడిపల్లి చైతన్య పిలుపు

కొత్తగా ఏర్పడినటువంటి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ హైకోర్టు లీగల్ సెల్ వైస్ చైర్మన్ పైడిపల్లి చైతన్య పిలుపునిచ్చారు. పాల్వంచ కొత్తగూడం సుజాతనగర్ తదితర ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని అభివృద్ధికి ప్రజలు చాలా దూరంగా అత్యంత ధైర్యం పరిస్థితిలో జీవిస్తున్నారని ఇది తెలుసుకున్న రేవంత్ ప్రభుత్వం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేయించిందని మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా ప్రజాపాలన అందుతుందని వారి సమస్యలను పరిష్కరించే అధికారం కార్పొరేటర్లకు ఉంటుందని అధికారుల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండదని చైతన్య పిలుపునిచ్చారు భారత రాష్ట్ర సమితి చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని ప్రలోభాలకు గురికా వద్దని ఓటర్లందరూ చైతన్యవంతులై తమ ఓటును వినియోగించుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉండటం వల్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధిని సాధించుకోవచ్చని తద్వారా ప్రజలకు కావలసినటువంటి కనీస అవసరాలను అందుకు తగిన నిధులను ప్రభుత్వం నుండి పొందేటువంటి అవకాశం ఉందని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి పది సంవత్సరాలు ఓట్లు దండుకొని కోట్ల సంపాదించారు తప్ప ప్రజలకు కావలసినటువంటి మౌలిక వసతులను ఏర్పరచడంలో విఫలమైందని కోట్లు దండుకొని కుటుంబ పాలనలో తెలంగాణ మగ్గిపోయిందని ఇటువంటి తరంగంలో ప్రజలు విసుగు చెంది కాంగ్రెస్ సర్కార్ గెలిపించాలని తెలియజేశారు. పాల్వంచ పట్టణంలో 36 డివిజన్లో ప్రజల మనిషి పైడిపల్లి మనోహర్రావు సతీమణి పైడిపల్లి జయలక్ష్మి కాంగ్రెస్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నారని 36 డివిజన్లోని ప్రజలందరూ ఏకతాటి మీద నిలబడి పైడిపల్లి విజయలక్ష్మిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని అభివృద్ధికి పాటుపడాలని పైడిపల్లి చైతన్య పిలుపునిచ్చారు. పైడిపల్లి మనోహర్రావు గతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మనిషిగా నిస్వార్థమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా ఎటువంటి పదవులు పొందకుండా ప్రజల తరఫున పోరాడి ప్రజలు కావలసినటువంటి అనేక సౌకర్యాలను ఏర్పరిచారని రోడ్లు డ్రైన్లు వితంతువుల పెన్షన్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా అనేక రకాల ప్రజా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన అడుగుజాడల్లో ఆయన సతీమణి పైడిపల్లి జయలక్ష్మి 36 డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని 36 డివిజన్లో ప్రజలందరూ పైడిపల్లి జయలక్ష్మి మెజారిటీతో గెలిపించి డివిజన్ అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి అండగా నిలబడాలని చైతన్య పిలుపునిచ్చారు.