News & Views

చర్చ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ,ఎస్.సీ.బీ నగర్ వర్షపు నీటి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా – శ్రీరాముల విశ్వనాథ్…

ఎస్.సీ.బీ నగర్ వర్షపు నీటి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా – శ్రీరాముల విశ్వనాథ్ 

– శాశ్వత పరిష్కారాలే నిజమైన అభివృద్ధి 

– అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందుతాయి 

– పొంగులేటి రాకతో గెలుపు ఖరారు చేసుకున్న కాంగ్రెస్ పోటీదారులు 

చర్చ, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 14వ డివిజన్ నుంచి సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ రాముల విశ్వనాథ్ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు, వీధిలైట్లు వంటి మౌలిక సదుపాయాలు సకాలంలో పూర్తి చేస్తానని, మౌలిక సదుపాయాలు అభివృద్ధిలో ఒక భాగం మాత్రమేనని, సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడమే నిజమైన అభివృద్ధి అని, ఆర్ఆర్ చికెన్ సెంటర్ నుండి ఎస్సిబీ నగర్ వరకు సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న వర్షపు నీటి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని, కల్వర్టుల నిర్మాణాలు జరిపి వరద నీటిని గోధుమ వాగులో కలిపే విధంగా అధికారులతో ప్రణాళికలు సిద్ధం చేయిస్తానని తెలిపారు. సింగరేణి ప్రాంతమైనటువంటి సీఆర్పీ క్యాంపు నందు ఇండ్లు లేని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇండ్ల స్థలాలను, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తానని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగానే సింగరేణి స్థలాల సమస్యలపై ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ అర్హులైన వారికి అందజేస్తానని, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ కార్డులు అందజేస్తానని, ప్రాథమిక విద్యకు ప్రాధాన్యతనిస్తూ పేద ధనిక పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల లోనే విద్యను అభ్యసించే విధంగా పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్న విశ్వనాథ్ పై కార్పొరేషన్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ అభివృద్ధి కోసం విశ్వనాథుని గెలిపించుకుంటామని ఆశ భావం వ్యక్తం చేశారు.