చర్చ : హైదరాబాద్, ట్రాఫిక్ చలానాకు ఆటో డెబిట్ యోచనలో రాష్ట్ర ప్రభుత్వం…
ట్రాఫిక్ చలానాకు ఆటో డెబిట్ యోచనలో రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే బ్యాంకు ఖాతా వివరాలు సేకరించాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కొత్త విధానం అమల్లోకి వస్తోంది. దీని ప్రకారం, వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడితే, నేరుగా బ్యాంకు ఖాతా నుంచే డబ్బులు కట్ అయ్యేలా ‘ఆటో డెబిట్’ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రతిపాదనతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. తమ బ్యాంకు ఖాతాలపై ట్రాఫిక్ పోలీసుల అజమాయిషీ పెరుగుతుందని, వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులు మాత్రం ప్రస్తుతానికి బ్యాంకు ఖాతాలతో ఎలాంటి లింకేజీలు లేవని చెబుతున్నారు.