చర్చ ,కొత్తగూడెం : కొత్తగూడెం తొలి మున్సిపల్ కార్పొరేషన్ లో పోలింగ్ ప్రారంభం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
*కొత్తగూడెం తొలి మున్సిపల్ కార్పొరేషన్ లో పోలింగ్ ప్రారంభం…*
చర్చ ,కొత్తగూడెం: కొత్తగూడెం తొలి మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గానికి పోలింగ్ భద్రత మధ్య ప్రారంభం అయింది. కొత్తగూడెం కార్పొరేషన్ కు తొలి ఎన్నికలు కావటం తో ఓటర్ల లో ఆసక్తి నెలకొన్నది . కొత్తగూడెం లో మొట్ట 60 డివిజన్ ల లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ 5 గంటలకు వరకు కొనసాగింది. పోలింగ్ బూత్ లా వద్ద డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షణ.. కొత్తగూడెం కార్పొరేషన్ తొలి పాలకవర్గ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధం అయింది. కొత్తగూడెం కార్పొరేషన్ లోని 60 డివిజన్ ల లో 201 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్ లు 1,34,775 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తగూడెం పట్టణం లో 29 డివిజన్ లు, పాల్వంచ లో 27 డివిజన్ లు, సుజాత నగర్ లో 4 డివిజన్ లలో పోలింగ్ కొనసాగుతున్నది . పోలీస్ శాఖా సైతం అప్రమత్తం అయింది . పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు తో పాటు నిఘా ముమ్మరం చేశారు. సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక గస్తీని నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు..