చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్…
చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా……
ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్..
కొత్తగూడెం మున్సిపాలిటీ లో ఈరోజు ఎన్నికలు . మొత్తం 60 డివిజన్లలో 201 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు. 1,34,775 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ సమయం ముగియనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్వంచ జగ్గుతండా వద్ద 48వ డివిజన్ బూత్ నంబర్ 159లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సద్వినియోగం చేసుకోవాలని ఎటువంటి ప్రలోభాలకు గురి కాకూడదని కలెక్టర్ తెలిపారు.. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వృద్ధులకు దివ్యాంగులకు వీల్ చైర్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.