News & Views

బాంబుల షాపు ముందు బైకు చోరీ

చర్చ ఖమ్మం జిల్లా కల్లూరు బైక్ చోరి

 

 

 

ద్విచక్ర వాహనం చోరీ

చర్చ : ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ శివారులో ఏర్పాటుచేసిన వినాయక ఫైర్ వర్క్స్ లో టపాసులు కొనటానికి కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎరుపు రంగు గ్లామర్ మోటార్ సైకిల్ ను షాపు ముందు పెట్టి టపాసులు కొనుగోలు చేయడానికి వెళ్ళాడు. టపాసులు కొని తిరిగి వచ్చేసరికి వాహనం కనపడకపోవడంతో చోరీకి గురైనట్టు గమనించి దుకాణదారుడు యొక్క సీసీ కెమెరాలు చెక్ చేయగా టోపీ ధరించిన వ్యక్తి వాహనం చోరీ చేసి తీసుకెళుతున్నట్టు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వెంటనే వాహనదారుడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.