భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నగర పాలక సంస్థ ఎన్నికలలో 1.00 గంటల వరకు…53.48% ఓటింగ్ నమోదు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం నగర పాలక సంస్థ ఎన్నికలలో 1.00 గంటల వరకు…53.48% ఓటింగ్ నమోదు..
*కొత్తగూడెం* కార్పొరేషన్ లో మధ్యాహ్నం 1 గంట వరకు పోలైన ఓట్లు… 72, 077.
నమోదైన పోలింగ్ శాతం… 53.48%
*ఇల్లందు* మున్సిపాలిటీలో నమోదైన పోలింగ్ శాతం … 44.50%
పోలైన ఓట్లు..15,007.
*అశ్వారావుపేట* మున్సిపాలిటీలో నమోదైన పోలింగ్ శాతం … 61.91%
పోలైన ఓట్లు..10,432
*భద్రాద్రి జిల్లా* వ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం..52.61%
పోలైన ఓట్లు.. 97,516
*ప్లీజ్ స్క్రోల్..*
*మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లాలో 52.61 శాతం పోలింగ్ నమోదు : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న మున్సిపాలిటీల & మున్సిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికల సందర్భంగా మధ్యాహ్నం 1.00 గంటల వరకు జిల్లాలో మొత్తం 52.61 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.
జిల్లాలోని 3 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని 106 వార్డుల్లో ఏర్పాటు చేసిన 288 పోలింగ్ కేంద్రాలలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందన్నారు. జిల్లాలో మొత్తం 1,85,348 మంది ఓటర్లలో మధ్యాహ్నం 1 గంట వరకు 97,516 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వివరించారు.
జిల్లాలోని 3 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని 106 వార్డుల్లో ఏర్పాటు చేసిన 288 పోలింగ్ కేంద్రాలలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందన్నారు. జిల్లాలో మొత్తం 1,85,348 మంది ఓటర్లలో మధ్యాహ్నం 1 గంట వరకు 97,516 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వివరించారు.
మున్సిపాలిటీ వారీగా పరిశీలిస్తే, అశ్వరావుపేటలో మొత్తం 16,850 మంది ఓటర్లలో 10,432 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 61.91 శాతం పోలింగ్ నమోదైంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1,34,775 మంది ఓటర్లలో 72,077 మంది ఓటు వేసి 53.48 శాతం పోలింగ్ నమోదైంది. యెల్లందు మున్సిపాలిటీలో 33,723 మంది ఓటర్లలో 15,007 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 44.50 శాతం పోలింగ్ నమోదైంది.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్రమపద్ధతిలో బారులు తీరుతూ ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని స్పష్టం చేశారు.